Lockdown Relaxation: సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న జనం

Lockdown Relaxation: Hyderabadis Back to Shopping
x

Lockdown Relaxation: సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న జనం

Highlights

Lockdown Relaxation: కళకళలాడే షాపింగ్‌ మాల్స్‌, కిక్కిరిసిపోయే వ్యాపార కేంద్రాలు లాక్‌డౌన్‌ కారణంగా బోసి పోయాయి.

Lockdown Relaxation: కళకళలాడే షాపింగ్‌ మాల్స్‌, కిక్కిరిసిపోయే వ్యాపార కేంద్రాలు లాక్‌డౌన్‌ కారణంగా బోసి పోయాయి. జనాలు లేక రోడ్లు వెలవెలబోయాయి. మరీ సడలింపులు వచ్చాక నగరానికి పూర్వ వైభవం వచ్చిందా అసలు నగరవాసులు ఏం అంటున్నారు.

కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్‌డౌన్‌. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసి కేసులను కంట్రోల్‌ చేసింది. కేసులు తగ్గుతున్న కొద్దీ లాక్‌డౌన్‌ను సడలించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఉదయం 6 నుండి సాయంత్రం 6గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో నగరం పూర్వవైభవాన్ని తెచ్చుకుంది. సడలింపు సమయంలో హైదరాబాద్‌ కళకళలాడుతోంది. వ్యాపారులు జోరుగా సాగుతున్నాయి. రోడ్లపై మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు కనిపిస్తున్నాయి.

షాపింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే కోటి లాక్‌డౌన్‌ వేళ నిర్మానుష‌్యంగా దర్శనమిచ్చింది. ఇప్పుడు సడలింపు సమయం అధికమవ్వడంతో మళ్లీ వ్యాపారాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లు ఇంట్లోనే ఉన్న జనాలు షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయకున్నా సడలింపు సమయాన్ని ప్రజలు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్‌ పూర్వ కళను సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories