Telangana: 22 వేల కోట్ల రూపాయల 'మందు' తాగేశారు!

Telangana: 22 వేల కోట్ల రూపాయల మందు తాగేశారు!
x
Highlights

తెలంగాణా లో మందుబాబులు గత సంవత్సరం ఎక్కడా తగ్గలేదు. ముందు సంవత్సరం కంటే 2వేల కోట్ల రూపాయల మందు ఎక్కువ తాగారు. ఆబ్కారీ శాఖ వివరాల ప్రకారం 2018 వ...

తెలంగాణా లో మందుబాబులు గత సంవత్సరం ఎక్కడా తగ్గలేదు. ముందు సంవత్సరం కంటే 2వేల కోట్ల రూపాయల మందు ఎక్కువ తాగారు. ఆబ్కారీ శాఖ వివరాల ప్రకారం 2018 వ సంవత్సరంలో కంటే 2019 సంవత్సరంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. రెండు వేల కోట్ల రూపాయల మందు ఎక్కువగా అమ్మకం జరిగింది. దీంతో రాష్ట్ర ఖజానాకు కిక్ ఎక్కింది. ఈ ఏడాది పది శాతం మద్యం అమ్మకాలు ఎక్కువ జరగడంతో ఇతరత్రా తగ్గిన ఆదాయాన్నీ మద్యం కొంత వరకూ భర్తీ చేసినట్లయింది. దీని లెక్కలో 2020 లో మరింత మద్యం అమ్మకాలు పెరుగుతాయానై అధికారులు అంచనా వేస్తున్నారు.

2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 2019 వరకూ 22 వేల కోట్ల మద్యాన్ని తాగేశారు. 2018 లో ఇదే కాలానికి 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే మద్యం అమ్మకాలు సాగాయి. ఇక ఈ సంవత్సరం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 8,200 కోట్ల రూపాయల అమ్మకాలు సాగించాగా 2018 లో ఆ మొత్తం 7,230 కోట్ల రూపాయలుగా ఉంది.

2019 లో మద్యం అమ్మకాలు ఇలా సాగాయి..

గత సంవత్సరం ప్రతి నెలా దాదాపు 1,600 కోట్ల రూపాయాల నుంచి.. 1,900 కోట్ల రూపాయల వరకూ మద్యం అమ్మకాలు సాగాయి. అయితే, ఒక్క సెప్టెంబర్ లో మాత్రం ఇంతకంటే తక్కువ సేల్స్ జరిగాయి. ఆనేలలో కేవలం 1,500 కోట్లు రూపాయలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఇకపోతే, నవంబర్, డిసెంబర్ నెలల్లో అయితే ఈ విక్రయాలు 2 వేల కోట్లకు చేరాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల వలన కూడా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఈ ఏడాది కూడా మద్యం అమ్మకాల్లో రికార్డులు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక పక్క మాంద్యం కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్న తరుణం లో ఆ ప్రభావం మద్యం పై లేకపోవడం విశేషం. ఇక 2019 చివరి రెండు నెలల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరగడం ఈ సంవత్సరంలోనూ అమ్మకాలు పెరిగే అవకాశం ఉండనే అంచనాలు అధికారులు వేస్తున్నారు. అంతే కాకుండా మద్యం ధరలు పెంచడంతో ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories