Nagar Kurnool: తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు గుండు కొట్టించిన ఎస్సై

Nagar Kurnool: బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ ఎస్పై దాష్టికానికి ఒడిగట్టిన అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Oct 2024 12:15 PM IST
Lingala SI Beheaded The Three Youths In Nagar Kurnool District
X

Nagar Kurnool: తన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు గుండు కొట్టించిన ఎస్సై

Nagar Kurnool: బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ ఎస్పై దాష్టికానికి ఒడిగట్టిన అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. లింగాల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయగా... ఎస్పై జగన్ అక్కడికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం వారిని సిబ్బంది సాయంతో పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

తన ముందు తల వెంట్రుకలు దువ్వుకున్నారు అనే కారణంతో సదరు ఎస్సై జగన్ ఆ ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించాడు. అవమాన తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story