Weather Update: నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..

* గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

Dhatripriya
Updated on: 24 May 2023 12:14 PM IST
Light Rains Today And Tomorrow
X

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Weather Update: సెగలు కక్కుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేడు,రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడా పడతాయని, గురువారం పొడి వాతావరణం నెలకొంటుందని ప్రకటించింది. కాగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, మెదక్‌, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story