Harish Rao: పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోము
Harish Rao: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పోరాడుతాం
Harish Rao: పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోము
Harish Rao: బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోం అన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పోరాడుతామన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్.. కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేపథ్యంలో హరీష్‌రావు పటాన్ చెరులో పర్యటించి బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం అయ్యారు. గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ఇన్ని నిబంధనలు ఎందుకు పెడుతుందని హరీష్‌రావు ప్రశ్నించారు.
Next Story




