ఇంటి డాబాపైన చిరుత.. భయాందోళనలో స్ధానికులు

ఇంటి డాబాపైన చిరుత.. భయాందోళనలో స్ధానికులు
x
Highlights

కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణ శివార్లలో చిరుత సంచరిస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత మంది ఈ వార్తలను కొట్టేసి నప్పటికీ ఇప్పుడు మాత్రం నమ్మక తప్పదు.

కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణ శివార్లలో చిరుత సంచరిస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత మంది ఈ వార్తలను కొట్టేసి నప్పటికీ ఇప్పుడు మాత్రం నమ్మక తప్పదు. అసలు ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ ఇంటి మేడపైకి చేరి హాయిగా సేదతీరింది. కాస్త టైంపాస్ చేయడానికి అటూ ఇటూ పచార్లు కూడా కొట్టింది. అలా ఎప్పటి నుంచి ఆ చిరుత డాబాపైన ఉందో తెలియదు కానీ దాన్ని గమనించిన స్థానికులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. అమ్మో పులి అంటూ భయాందోళలనకు గురయ్యారు.

పూర్తి వివరాల్లోకెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి కలకలం రేపింది. షాద్ నగర్ లో నివాసముంటున్న మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై చేరుకుంది. ఆ విషయాన్ని గమనించిన స్ధానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడిని చేరుకున్న అధికారులలో షాద్ నగర్ ఏసీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఐ కృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి తదితర సిబ్బంది ఉన్నారు.

అక్కడికి చేరుకున్న అధికారులలో ఏసీపీ సురేందర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో జనాలను ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉండడంతో ఆ ప్రాంతం నుంచే చిరుత నగరంలోకి ప్రవేశించి ఉంటుందని స్ధానికులు అనుకుంటున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories