Harish Rao: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అనేక ఘటనలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Jun 2024 3:45 PM IST
Law and order has deteriorated in Telangana Says Harish Rao
X

Harish Rao: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

Harish Rao: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు హరీష్‌రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించారు. గడిచిన పదేళ్ళలో తెలంగాణ శాంతిభద్రతలకు చిరునామాగా మారిందని...కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారడం బాధగా ఉందన్నారు. ఇకనైన ప్రభుత్వం కళ్లు తెరిచి, శాంతిభద్రతలు కాపాడాలని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story