Mahabubabad: నకిలీ స్వామీజీ గుట్టురట్టు..పూజల పేరుతో మహిళను లోబరుచుకున్న నిందితుడు

Mahabubabad వీడియోలు, ఫోటోలు తీసి డబ్బులివ్వాలని బెదిరింపులు

Dhatripriya
Published on: 10 Jun 2023 4:15 PM IST
Ladies Beating Fake Swamiji In Mahabubabad
X

Mahabubabad: నకిలీ స్వామీజీ గుట్టురట్టు..పూజల పేరుతో మహిళను లోబరుచుకున్న నిందితుడు

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లో ఓ నకిలీ స్వామీజీ గుట్టురట్టైంది. పూజల పేరుతో మహిళలను వేధిస్తున్న నకిలీ స్వామీజీని చితకబాది పోలీసులకు అప్పగించారు మహిళలు. హైదరబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్వామీజీని ఆశ్రయించగా.. అదే అదనుగా భావించి లోబరుచుకున్నాడు. తర్వాత తన దగ్గర నగ్న వీడియోలు ఉన్నాయంటూ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. మహిళా సంఘాలను ఆ‌శ్రయించి బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేయడంతో.. తొర్రూరులో రెక్కీ నిర్వహించి స్వామీజీని పట్టుకున్నారు మహిళలు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Dhatripriya

Dhatripriya

Next Story