KTR: వీరాభిమాని ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్

KTR: కేటీఆర్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం

Jyothi
Published on: 8 Jan 2024 7:27 AM IST
KTR Visits Ibrahim Khan Home In Borabanda
X

KTR: వీరాభిమాని ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్

KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. తన వీరాభిమాని ఇంటికి వెళ్లి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్‌‌కు కేటీఆర్ ఎంతో అభిమానం. ట్వి్ట్టర్ వేదికగా తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్‌ను రెక్వెస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన కేటీఆర్.. త్వరలోనే ఇంటికొస్తానని మాటిచ్చారు. దీంతో ఆదివారం రాత్రి జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి అభిమాని ఇంటికి వెళ్లారు. కేటీఆర్‌ను చూసిన ఇబ్రహీంఖాన్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కేటీఆర్‌ను ఆ కుటుంబం అతిథి మర్యాదలతో సత్కరించింది.

న్యూ ఇయర్ సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి తన ఇంటికి రావాలని ఇబ్రహీం ఖాన్ కుటుంబం కోరింది. ఆ కుటుంబం కోరిక మేరకు కేటీఆర్ అక్కడికి వెళ్లారు. కేటీఆర్‌‌తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. ఇబ్రహీంఖాన్ పిల్లలకు ఉన్న మూగ, చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు కేటీఆర్‌కి రుణపడి ఉంటామని ఇబ్రహీం కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని అండగా ఉంటానని ఇబ్రహీంతో కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్, మాగంటి పంచుకున్నారు.

Jyothi

Jyothi

Next Story