KTR: నిరుద్యోగుల ఆందోళనపై కేటీఆర్ స్పందన

KTR: కాంగ్రెస్ కు చెందిన ఇద్దరికి మాత్రం మేలు జరిగింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2024 3:34 PM IST
KTR  response to the agitation of the unemployed
X

KTR: నిరుద్యోగుల ఆందోళనపై కేటీఆర్ స్పందన

KTR: రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొన్ని రోజులుగా నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తెలంగాణ యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. మోసపూరిత మాటలు నమ్మిన నిరుద్యోగుల వలన ఆ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు లభించాయన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. భర్తీ చేస్తామని చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదన్నారు. మరి రెండు లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కేటీఆర్ ప్రశ్నించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story