KTR: ఓయూ ఇష్యూపై స్పందించిన కేటీఆర్

KTR: పోలీసుల వైఖరిని ఖండించిన కేటీఆర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 July 2024 5:30 PM IST
KTR responded on OU issue
X

KTR: ఓయూ ఇష్యూపై స్పందించిన కేటీఆర్

KTR: ఓయూ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిచారు. రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలనలో జర్నలిస్ట్ లకు కూడా రక్షణ లేదా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఓయూ లో డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను కవర్ చేస్తున్న జర్నలిస్ట్‌లను అక్రమంగా అరెస్ట్ చేయటం దారుణమని మండిపడ్డారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే తప్పా అని ప్రశ్నించారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story