KTR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేటీఆర్ ఏమన్నారంటే..?

KTR: BRS మరో 50 ఏళ్లు కొనసాగేటట్లు బలంగా తయారు చేసుకుందాం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Aug 2024 4:59 PM IST
KTR Reacts On Merging Of BRS In To BJP
X

KTR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేటీఆర్ ఏమన్నారంటే..?

KTR: BRS మరో పార్టీలో విలీనం కాబోతుందని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగానే తమకు బీజేపీతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత 150 రోజులు జైల్లో ఉండేదా అని ప్రశ్నించారు. కవితకు బెయిల్ కోసం తాను ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడితే,,, బీజేపీ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైన అయినా కేసులు ఉన్నాయా.. మరి ఎవరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందో గుర్తించాలన్నారు. 24 ఏళ్ల పాటు గులాబీ పార్టీ విజయవంతంగా కొనసాగింది, మరో 50 ఏళ్లు కొనసాగేటట్లు బలంగా తయారు చేసుకుందామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story