Telangana: అంబేద్కర్ ఆలోచనలు ఎంతో గొప్పవి - మంత్రి కేటీఆర్

Telangana:125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తాం.. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషిచేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Samba Siva Rao
Updated on: 14 April 2021 12:15 PM IST
KTR Paid Floral Tributes to Dr. BR Ambedkar
X

KTR

Telangana: హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందరికీ సమాన హక్కులు ఉండాలన్న అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని మంత్రి కొనియాడారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు మంత్రి గుర్తుచేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ విగ్రహం వద్ద ఆయనకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌ గౌడ్, కొప్పుల ఈశ్వర్‌ నివాళులు అర్పించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story