KTR: రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలనే కోరుకుంటున్నా

KTR: సీఎం పక్కనే ఉన్న ఖమ్మం, నల్గొండ బాంబులే రేవంత్ ప్రభుత్వానికి సమస్య

Shekhar G
Published on: 7 March 2024 5:52 PM IST
KTR Key Comments On CM Revanth Reddy Comments
X

KTR: రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలనే కోరుకుంటున్నా

KTR: మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. కత్తులు, కత్తెరలు.. మానవబాంబ్‌ల జేబులో పెట్టుకుని తిరిగే వాళ్లు సీఎంగా ఉండటం దౌర్భాగ్యం అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాని ఎలాంటి హానీ ఉండదని.. సీఎం పక్కనే ఉండే ఖమ్మం, నల్గొండ బాంబులతోనే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం ఉంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలనే.. తాను కోరుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story