పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్

KTR-Ponnala: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముగిసింది.

Arun Chilukuri
Published on: 14 Oct 2023 4:07 PM IST
KTR Invites Ponnala Lakshmaiah to Join BRS
X

పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్

KTR-Ponnala: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముగిసింది. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించినట్లు కేటీఆర్‌ తెలిపారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని అన్నారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేస్తామన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం పొన్నాల‌ ఇంటికి మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, శానంపూడి సైదిరెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్‌ వెళ్లారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల ల‌క్ష్మ‌య్య రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story