KTR: కాంగ్రెస్ లూట్స్ తెలంగాణ.. మద్యంపై ఉన్న ధ్యాస - మద్దతు ధరపై లేకపాయే..

Congress Loots Telangana: మద్యంపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో విషయంపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 Oct 2024 12:31 PM IST
KTR Slams Ponguleti Srinivasa Reddy and Sanjay Kumar
X

KTR: ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ్తామా?

Congress Loots Telangana: మద్యంపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో విషయంపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర, మంచి బోధన, మందుబిళ్లలు, మూసి బాధితులు, మంచినీళ్లు, పింఛన్ పెంపు, భరోసా పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆక్షేపించారు. 10 తగ్గిస్తే... పగబట్టి 10కి 10 కలిపి మరి పెంచుతాం అంటున్నారని విమర్శించారు.

నాడు అడ్డగోలు ఆరోపణలు చేసి... నేడు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. పెంచుకో, దంచుకో, పంచుకో అన్న విధంగా మద్యం ధరల పెంపు అన్న కేటీఆర్.... రేపు ఏం పెంపో.... ఎన్నెన్ని పెంపో అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లూట్స్ తెలంగాణ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story