KTR: కాంగ్రెస్‌ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చింది

KTR: కాంగ్రెస్‌, బీజేపీ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పనిచేస్తున్నాయి

Jyothi
Published on: 10 April 2024 2:54 PM IST
KTR Fire On Congress
X

KTR: కాంగ్రెస్‌ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చింది 

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పటికీ రైతు రుణ మాఫీ చేయలేదని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ‍యన మాట్లాడారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పని చేస్తున్నాయని విమర్శించారు.

పార్టీ నుంచి పోయేవాళ్లు నేతలు మాత్రమేనని, కార్యకర్తలు ఎప్పటికీ పార్టీతోనే ఉంటారన్నారాయన... ప్రజలు తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా అప్పజెప్పారని, ప్రజాతీర్పు ప్రకారమే ముందుకు వెళ్తున్నా‎మని చెప్పారు కేటీఆర్.. ప్రజలు మొదటగా పదేళ‌్లు బీఆర్‌ఎస్‌కే అవకాశం ఇచ్చారని, పదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.

Jyothi

Jyothi

Next Story