KTR: తెలంగాణ ఆదాయం తగ్గుతోంది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది

KTR: తెలంగాణ ఆదాయం తగ్గుతోంది... కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Oct 2024 9:47 AM IST
KTR Criticise Congress Govt
X

KTR: తెలంగాణ ఆదాయం తగ్గుతోంది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది

KTR: తెలంగాణ ఆదాయం తగ్గుతోంది... కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిన తెలంగాణకు... అసమర్థ, అవినీతి పాలనే శాపంగా మారిందని ఆక్షేపించారు. తప్పులపై తప్పులు చేసి... తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం... ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం... మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యం అన్నారు.

అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి... పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికీ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. పది నెలల పాలనలోనే అన్ని రంగాలను ఆగం చేశారని విమర్శించారు. కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలయిందని... అవినీతి, అక్రమార్జనకు... పెట్టుబడిదారులు బెంబేలు అవుతున్నారన్నారు. అధ్వాన్నంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై... వెయ్యి అధ్యయనాలు చేసినా... రాష్ట్రానికి నో యూజ్ అని ట్వీట్ చేశారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story