KTR: రాజీవ్‌ విగ్రహం ఏర్పాటుపై రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

KTR: నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్‌ మినిస్టర్‌ అంటూ కేటీఆర్‌ హెచ్చరిక

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Aug 2024 2:51 PM IST
KTR Counters To Revanth Reddy
X

KTR: రాజీవ్‌ విగ్రహం ఏర్పాటుపై రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

KTR: రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామన్నారు. నీలాంటి ఢిల్లీ బానిస తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరనీ కామెంట్ చేశారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుందన్నారు. సీఎం మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story