KTR: కాంగ్రెస్‌ది జనజాతర సభ కాదు.. అబద్ధాల జాతర

KTR: కాంగ్రెస్ సభపై ఎక్స్‌లో కేటీఆర్ విమర్శలు

Shashank Gullapelli
Published on: 7 April 2024 1:38 PM IST
KTR Comments On Congress Jana Jathara Sabha
X

KTR: కాంగ్రెస్‌ది జనజాతర సభ కాదు.. అబద్ధాల జాతర

KTR: తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ కాకుండా...అబద్దాల జాతర నిర్వహించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట గారడి చేశారంటూ ట్విట్టర్ వేదికంగా విమర్శలు చేశారు. ఇప్పుడు న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అన్నదాతలు నష్టపోతున్నారన్నారు. రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా

ఆదుకోరా అని ప్రశ్నించారు. కులగణన పేరిట కొత్త పల్లవికి ఓట్లు రాలవన్నారు. తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కేటీఆర్ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story