KTR: ఎవనిది కుట్ర.. ఏంది ఆ కుట్ర..?' -ఎక్స్‌లో కేటీఆర్ ఫైర్

KTR Tweet: ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 Nov 2024 12:28 PM IST
KTR Comments On CM Revanth Reddy
X

KTR: నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు

KTR Tweet: ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 'ఎవనిదిరా కుట్ర.. ఏంది ఆ కుట్ర..? అంటూ పరుషపదజాలం ఉపయోగిస్తూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా పలు కామెంట్స్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో..రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్చడం కుట్ర కాదా? అని కేటీఆర్ మండిపడ్డారు.

తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం వెనుక ఎవరి కుట్ర ఉంది..? పేద లంబాడా రైతులను బెదిరించడం వెనుక ఎవరి కుట్ర ఉంది..? మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టించడం వెనుక ఎవరి కుట్ర ఉంది అని ప్రశ్నించారు. 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు.. రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఏదో ఒక కేసులో ఇరికించి..అరెస్ట్ చేయిస్తారని..తనకు ఎప్పుడో తెలుసని..రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతానని ట్వీట్ చేశారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story