KTR: రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది

KTR: రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు

Jyothi
Published on: 23 April 2024 2:20 PM IST
KTR Comments On BJP
X

KTR: రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది

KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన రోడ్‌లో షోలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేని బీజేపీ.. రాముడి పేరుతో మాత్రం రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. మతం అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకునే ప్లాన్‌ను బీజేపీ అవలంబిస్తోందని ఆరోపించారు కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story