KTR: పార్టీ కార్యకలాపాలను విస్త్రృతం చేయండి.. కార్పొరేటర్లకు కేటీఆర్‌ దిశానిర్దేశం.

KTR పార్టీ బలోపేతానికి కార్పొటర్లు కృషి చేయాలి

Dhatripriya
Published on: 13 Jun 2023 5:20 PM IST
KTR Asks Party Corporators To Utilise Ward Offices To Solve Issues Of The People
X

KTR: పార్టీ కార్యకలాపాలను విస్త్రృతం చేయండి.. కార్పొరేటర్లకు కేటీఆర్‌ దిశానిర్దేశం.

KTR: GHMC బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధికి పాటు పడుతున్న తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని మార్గనిర్దేనం చేశారు. 16న GHMC పార్టీ వార్డు కార్యాలయాలు ప్రారంభిస్తుందని... వీటి ద్వారా నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కోరారు. కార్పొరేటర్లు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబీర్‌పూర్ రాజు, మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story