KTR: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం

KTR: పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన కేటీఆర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Sept 2024 3:46 PM IST
KTR anger over the house arrest of BRS leaders across the state
X

KTR: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం

KTR: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి.. రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా? అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story