Fruit Market: బాటసింగారానికి తరలిన కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్..

Fruit Market: బాటసింగారానికి తరలిన కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్..
Fruit Market: కోర్టు తీర్పు వచ్చేవరకు వ్యాపారాలు చేయమంటున్న ఏజెంట్లు...
Fruit Market: హైదరాబాద్ కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ తరలింపు కొత్త తంటాలు తెచ్చి పెట్టింది. నగరంలో ఉన్న పండ్ల మార్కెట్ బాట సింగారం వెళ్లడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. కమీషన్ ఏజెంట్లు వ్యాపారాలు నిలిపివేయడంతో రోడ్లపైనే పండ్ల... క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ ఇబ్బందులు, మరోవైపు మున్సిపల్ అధికారుల చర్యలతో వ్యాపారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఫ్రూట్ మార్కెట్‌ను బాటసింగారంకు తరలించినా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సరిగ్గా జరగక తిరిగి కొత్తపేట్ పరిసరాలకే చేరుకుంటున్నారు. సకల సౌకర్యాలు కల్పించామని ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు బాట సింగారంపైపు ఆసక్తి కనబర్చడం లేదు. కమీషన్ ఏజెంట్లతే కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం చేయబోమంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో కొత్తపేట్‌లో పండ్ల వ్యాపారం ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నుల కొద్దీ వచ్చే రకరకాల పండ్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రోడ్లపై పండ్లు విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారమే మానేసినట్లు చెబుతున్నారు.
మొత్తానికి చిరు వ్యాపారులు బాటసింగారం వెళ్లలేక, కొత్తపేట్‌లో పండ్లు అమ్మలేక కుటుంబపోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMT