Kothakota: సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఐ

మండలపోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం గ్రామ సర్పంచ్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

S. Srikanth
Published on: 25 March 2020 8:02 PM IST
Kothakota: సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఐ
X

కొత్తకోట: మండలపోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం గ్రామ సర్పంచ్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి పాల్గొని, గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు సూచించాలని తెలిపారు.

గ్రామంలోకి ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో అందించాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎస్సై నాగశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story