Kommuri Pratap Reddy: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Kommuri Pratap Reddy: జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తాం

Shekhar G
Published on: 3 Nov 2023 6:39 PM IST
Kommuri Pratap Reddy Campaigned In Cheyal Mandal Of Siddipet District
X

Kommuri Pratap Reddy: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Kommuri Pratap Reddy: జనగామ నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేని స్థానికేతరుడు కావాలా...ఈప్రాంతంలో పుట్టి ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావాలా అని నియోజకవర్గ ప్రజలను ప్రశ్నించారు జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... పలువురు బీఆర్‌ఎస్ నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు.

సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతోనే కాంగ్రెస్ ప్రచారం సాగిస్తున్నామని అన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన దొరల పెత్తందారుల దౌర్జన్యాన్ని అరికట్టుట కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని తెలిపారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించి జనగామ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story