Telangana: కోదాడ రూరల్ సి‌ఐ కి అవార్డ్

S. Srikanth
Published on: 12 Jan 2020 10:55 AM IST
Telangana: కోదాడ రూరల్ సి‌ఐ కి అవార్డ్
X

కోదాడ: ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల సందర్బంగా శాంతిభద్రతలు పరిరక్షణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను కోదాడ రూరల్ సి‌ఐ శివరామి రెడ్డికి తెలంగాణ స్టేట్ డెమోక్రసీ అవార్డ్ వచ్చింది. హైదరరాబాద్ తారామతి బారాదారి ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర రాజన్ నుండి అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.

నల్గొండ జిల్లాలో డి‌సి‌ఆర్‌బి మరియు ఎలక్షన్ సెల్ అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డ్ రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సి‌ఐ కార్యాలయ సిబ్బంది అభినందిచారు.

S. Srikanth

S. Srikanth

Next Story