Kodad: పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలి

Kodad: పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలి
x
Highlights

బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ నియమితులు కావడం పట్ల కోదాడ నియోజకవర్గ బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

కోదాడ: బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ నియమితులు కావడం పట్ల కోదాడ నియోజకవర్గ బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య మాట్లాడుతూ సంజయ్ నాయకత్వంలో కోదాడ నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్ష హోదాలో సంజయ్ ఈనెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్నందున బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలకానున్నాయని, ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు నూనె సులోచన, ఓర్సు వెలంగి రాజు, అక్కిరాజు యశ్వంత్, యాదా రమేష్, కనగాల నారాయణ, వంగవీటి శ్రీనివాసరావు, నకిరికంటి జగన్, యారగాని రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories