Kishan Reddy: హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు.. అందుకే ఈ దుశ్చర్య

Kishan Reddy: సికింద్రాబాద్‌‌లో అమ్మవారి విగ్రహం ఘటన మతోన్మాద శక్తుల పనేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Oct 2024 12:57 PM IST
Kishan Reddy: హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు.. అందుకే ఈ దుశ్చర్య
X

Kishan Reddy: హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు.. అందుకే ఈ దుశ్చర్య

Kishan Reddy: సికింద్రాబాద్‌‌లో అమ్మవారి విగ్రహం ఘటన మతోన్మాద శక్తుల పనేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఘటనను పోలీసులు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దొంగతనం చేయడానికి వచ్చారని ఒకసారి... మతిస్థిమితం లేని వ్యక్తులు చేసుంటారని మరోసారి చెబుతున్నారని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన కిషన్ రెడ్డి... ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

నేడు ఉదయం ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే అమ్మవారి విగ్రహాన్ని ధ్వసం చేసినట్లు వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story