పాతబస్తీ మెట్రో రైలుకు ఎంఐఎం అడ్డుపడుతుంది : మంత్రి కిషన్ రెడ్డి

admin1
Published on: 15 Feb 2020 9:48 PM IST
పాతబస్తీ మెట్రో రైలుకు ఎంఐఎం అడ్డుపడుతుంది : మంత్రి కిషన్ రెడ్డి
X

పాతబస్తీ మెట్రో రైల్ కు ఎంఐఎం అడ్డుపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాతబస్తీ వాసులకు మెట్రో దూరం చేయడంలో ఎంఐఎం కుట్ర ఉందని, అందులో టీఆర్ఎస్ భాగస్వామి అని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని జేబీఎస్ మెట్రో రైల్ స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలతో కలిసి ఆయన ప్రయాణించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్ల నిధులు ఇచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

admin1

admin1

Next Story