Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌

Kidnapping Of A Boy At Secunderabad Railway Station
x

Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌

Highlights

Secunderabad: బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు

Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌లో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. మెదక్‌ జిల్లా రాయలపురం గ్రామానికి చెందిన దుర్గేష్‌.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి తిరుమలకు వెళ్లాడు. దర్శనం అనంతరం.. ఈ నెల 28న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుపయనమయ్యాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చిన అనంతరం.. బాలుడిని ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఉంచి.. వాష్‌రూమ్‌కు వెళ్లాడు తండ్రి దుర్గేష్. తిరిగొచ్చేసరికి బాలుడు కనిపించకపోవడంతో.. రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. రైల్వే్స్టేషన్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించిన రైల్వే పోలీసులు.. బాలుడిని ఓ గుర్తుతెలియని జంట ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories