Nizamabad: కిడ్నాపైన మూడేళ్ల చిన్నారి క్షేమం

Nizamabad: నిజామాబాద్‌లో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారి అష్క్యా హనీ ఆచూకీ లభ్యమైంది.

Arun Chilukuri
Published on: 10 Oct 2021 6:56 PM IST
Kidnapped Nizamabad Child Found in Maharashtra
X

Nizamabad: కిడ్నాపైన మూడేళ్ల చిన్నారి క్షేమం

Nizamabad: నిజామాబాద్‌లో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారి అష్క్యా హనీ ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్రలోని నర్సిలో పాపను కిడ్నాపర్‌ వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. తల్లిదండ్రులకు వీడియో కాల్‌ చేసి, చిన్నారితో మాట్లాడించారు. ఇక పాపను తమ వెంట పెట్టుకొని నిజామాబాద్‌కు బయల్దేరారు పోలీసులు. శుక్రవారం నాడు నిజామాబాద్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద పాప కిడ్నాప్‌నకు గురైంది.

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు పాపను తీసుకొని మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో పాప ఆచూకీ కనుగొన్నారు. ఇక కిడ్నాపర్‌ చెర నుంచి చిన్నారి సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story