Khairatabad Ganesh 2021: ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా?

Khairatabad Ganesh Idol to be 40 Feet Tall This Year
x

(ఫైల్ ఇమేజ్ )

Highlights

Khairatabad Ganesh 2021: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ గణపతి చిత్రపటం విడుదల చేసింది గణేష్ ఉత్సవ కమిటీ.

Khairatabad Ganesh 2021: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ గణపతి చిత్రపటం విడుదల చేసింది గణేష్ ఉత్సవ కమిటీ. ఈ ఏడాది శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో భక్తులకు ఖైరతాబాద్‌ గణేశుడు దర్శనమివ్వనున్నారు. ఇక ఈ ఏడాది 40 అడుగులతో ఖైరతాబాద్‌ వినాయకుడి విగ్రహం రూపు దిద్దుకుంటోంది. గణేశుడికి కుడివైపు కృష్ణకాళీ, ఎడమవైపు కాలనాగేశ్వరి విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.

సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి శనివారం తెలిపింది. ఈ ఏడాది కొవిడ్ జాగ్రత్తలతో ఉత్స‌వాల‌ను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయ‌న‌ తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్‌ 10న ప్రారంభమై 19వ తేదీ ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ముగియ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories