Honey Trap Case: హిమాంబి హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు
Honey Trap Case: డబ్బులు అడిగినందుకే హనీ ట్రాప్ చేయించి హత్యకు ప్లాన్
Honey Trap Case: హిమాంబి హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు
Honey Trap Case: హిమాంబి హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్ది తల్లీకూతుర్ల భాగోతాలు బయటపడతున్నాయి. తల్లి హిమాంబిపై గతంలో ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ హిమాంబి పలుమార్లు పట్టుబడింది. కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేసి 3లక్షల వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నజీమాతో మృతుడు రాము చనువుగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే రాము నుంచి 50లక్షలు తీసుకున్నట్టు సమాచారం. డబ్బులు అడిగినందుకే హనీ ట్రాప్ చేయించి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిమాంబి, నజీమా కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story




