ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం

-ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా -ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

admin1
Updated on: 14 Nov 2019 8:02 PM IST
ashwathama reddy
X
ashwathama reddy

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్షం నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అలాగే ఈ నెల 16 నుంచి ఆర్టీసీ జేఏసీ నేతల నివరధికదీక్ష చేపట్టబోతున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీక్షలో తనతో పాటు.. రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ కూర్చుంటారని తెలిపారు. రేపు అన్ని డిపోల నుంచి గ్రామాల్లోకి బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని.. చెప్పారు. 19 నహైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్‌కు పిలుపునిచ్చారు.

admin1

admin1

Next Story