Kerala: బీజేపీ కార్యకర్త హత్య కేసులో.. 15 మందికి మరణ శిక్ష విధించిన కోర్టు

Kerala: హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు

Jyothi
Published on: 30 Jan 2024 12:28 PM IST
Kerala  Court Sensational Verdict in Murder Case
X

Kerala: బీజేపీ కార్యకర్త హత్య కేసులో.. 15 మందికి మరణ శిక్ష విధించిన కోర్టు

Kerala: బీజేపీ నేత, న్యాయవాది రంజీత్ శ్రీనివాసన్ హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డీపీఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ హత్యలో ప్రధానంగా ఎనిమిది మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.

2021 డిసెంబర్ 19న ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాసన్‌‌ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. ఎస్డీపీఐ కార్యకర్త కేఎస్ షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన కుటుంబ సభ్యుల ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటన ఆ సమయంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.

Jyothi

Jyothi

Next Story