KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

Power Commission: మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Arun Chilukuri
Updated on: 1 July 2024 11:24 AM IST
KCR Writ Petition Dismissed in High Court
X

మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్ కొట్టివేత

Power Commission: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story