Harish Rao: ఏకలవ్య కులానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు

Harish Rao: కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని గుర్తుచేసిన హరీశ్ రావు

Shashank Gullapelli
Published on: 11 March 2024 8:03 PM IST
KCR Wanted To Make A Person From Ekalavya Caste As MLC Says Harish Rao
X

Harish Rao:ఏకలవ్య కులానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు

Harish Rao: ఏకలవ్య కులానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ భావిస్తే... గవర్నర్ తిరస్కరించి అన్యాయం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేటలో నిర్మించిన ఏకలమిత్ర మండలి భవనానికి హరీశ్ రావు భూమిపూజ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సిద్దిపేటలో ఏకలవ్య భవనాన్ని నిర్మాణం చేసుకున్నామన్నారు. ఎమ్మెల్యేలుగా ఏకలవ్యలు గెలిచే పరిస్థితి లేదని... అందుకే ఎమ్మెల్సీగా సత్యనారాయణ కేసీఆర్ అవకాశమిచ్చారన్నారు. కానీ గవర్నర్ తిరస్కరించి వెనక్కి పంపించారని... హైకోర్టు సైతం ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టిందన్నారు హరీశ్ రావు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story