ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

KCR: ఎండిన పంటలను పరిశీలించనున్న గులాబీ బాస్

Jyothi
Published on: 5 April 2024 8:31 AM IST
KCR visit to Karimnagar and Rajanna Sircilla district today
X

ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

KCR: కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించి... రైతలను పరామర్శించనున్నారు. ముందుగా ముక్దుంపూర్ చేరుకుంటారు. గ్రామంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు.

రెండు గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చేరుకుంటారు. గ్రామంలో పంట పొలాలను పరిశీలిస్తారు. శాభాష్ పల్లి దగ్గర మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story