KCR: ధరావత్‌తండాలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్‌..

KCR: తండాలో రైతులతో ముచ్చటించిన కేసీఆర్

Jyothi
Published on: 31 March 2024 2:06 PM IST
KCR visit to Jangaon District
X

KCR: ధరావత్‌తండాలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్‌..

KCR: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలు.. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతలకు అండగా ఉండేందుకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు పొలంబాట పట్టారు.

మూడు జిల్లాల పర్యటనలో భాగంగా జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకున్న కేసీఆర్ అక్కడ ఎండిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంట పరిస్థితి.. ఎండిపోయిన పొలాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట వెళ్లారు. మార్గమధ్యలో పోలీసులు కేసీఆర్ వాహనాన్ని ఆపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. మొండ్రాయి చెక్‌పోస్ట్ దగ్గర బస్‌ను ఆపి తనిఖీలు నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story