ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బయటకు రానీయవద్దు : సీఎం కేసీఆర్

ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బయటకు రానీయవద్దు : సీఎం కేసీఆర్
x
Highlights

కరోనా పాజిటివ్ కేసులు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి...

కరోనా పాజిటివ్ కేసులు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నందున అధికారులు హైదరాబాద్ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించారు.

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిరోదానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నందున హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలని అధికారులకు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగించారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరువలకు త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు హైదరాబాద్ నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలని..ప్రతి యూనిట్ కు ప్రత్యేక వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించారు. మున్సిపల్ యంత్రాంగం అంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశామని ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించి ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీవద్దని బయట వారిని లోనికి వెళ్లనీయవద్దన్నారు.

పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories