Telangana Bhavan: రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

KCR: రేపు ఉ.11గంటలకు కృష్ణా పరివాహక ప్రాంత.. ఉమ్మడి జిల్లాల నాయకులతో కేసీఆర్ సమావేశం

Jyothi
Updated on: 5 Feb 2024 3:25 PM IST
KCR to Telangana Bhavan Tomorrow
X

రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

KCR: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్‌ రానున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా నేతలతో ఆయన సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిన అంశంపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరో వైపు అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.

Jyothi

Jyothi

Next Story