మంత్రి సత్యవతి రాథోడ్‌ని ఇంటర్వ్యూ చేసిన కేసీఆర్ మనవడు..

admin1
Updated on: 20 Nov 2019 3:43 PM IST
హిమాన్షు, సత్యవతి రాథోడ్‌
X
హిమాన్షు, సత్యవతి రాథోడ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేశారు. స్కూల్ ప్రాజెక్ట్ విషయమై మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్టు హిమాన్షు తెలిపారు. ఈ సందర్భంగా శిశు సంక్షేమం గురించి మంత్రితో చర్చించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇంటర్వ్యూ ఫోటోను పెట్టారు.

ఇదిలా ఉంటే మంగళవారం సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌ను సత్యవతి రాథోడ్ సందర్శించారు. బాలల్లో నేర ప్రవృత్తి నిరోధించాలంటే తల్లిదండ్రులు వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఇందుకోసం తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జువైనల్ హోమ్‌లో ఉన్న కొంతమంది పిల్లల్ని చూసేందుకు వారి తల్లిదండ్రులు రాకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కారణాలు తెలుసుకుని వారిని వచ్చేలా చేయాలని అధికారులను ఆదేశించారు.



admin1

admin1

Next Story