Kishan Reddy: ఆర్టీసీ భూముల మీద కేసీఆర్ కుటుంబం కన్నేసింది

Kishan Reddy: ఆర్టీసీపై కేసీఆర్ సర్కార్ రాజకీయాలు చేస్తోంది

Shekhar G
Published on: 6 Aug 2023 2:25 PM IST
KCR Family Eyed The RTC Lands Says Kishan Reddy
X

Kishan Reddy: ఆర్టీసీ భూముల మీద కేసీఆర్ కుటుంబం కన్నేసింది

Kishan Reddy: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కేంద్రమంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగానే ఉంటూ వస్తోందని, రానున్న రోజుల్లో కార్మికులకు మరింత అండగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ విలీనం విషయంలో తమ పార్టీని బద్నాం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి ప్రేమలేదని, ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులపై మాత్రమే ప్రేమ ఉందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై తమకున్న చిత్తశుద్ధిని కొత్తగా ఎవరికీ చెప్పుకోవాల్సిన పని లేదని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story