ర్యాడ మ‌హేశ్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్

Arun Chilukuri
Updated on: 10 Nov 2020 11:15 AM IST
ర్యాడ మ‌హేశ్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక సాయం : సీఎం కేసీఆర్
X

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ ర్యాడ మహేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story