Karvy: కార్వీకి సంబంధించిన రూ. 700 కోట్ల షేర్‌లను ఫ్రీజ్‌ చేసిన ఈడీ

* రూ.3 వేల కోట్ల ఫ్రాడ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు * పార్థసారథి ఇల్లు, కార్యాలయాలపై ఆరు చోట్ల దాడి

Sandeep Reddy
Updated on: 25 Sept 2021 2:45 PM IST
Karvy Company Rs 700 Crore Shares Frozen by Enforcement Directorate
X

Karvy: కార్వీకి సంబంధించిన రూ. 700 కోట్ల షేర్‌లను ఫ్రీజ్‌ చేసిన ఈడీ

Karvy: కార్వీ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. దాదాపు 700 కోట్ల రూపాయల షేర్‌లను ఈడీ ఫ్రీజ్‌ చేసింది. హైదరాబాద్‌, గుంటూరులోని పార్థసారథి ఇల్లు, కార్యాలయాలతోపాటు ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. అంతేకాదు కార్వీ హెడ్‌ఆఫీస్‌లో పదిగంటలపాటు సోదాలు నిర్వహించారు అధికారులు. 3వేల కోట్ల ఫ్రాడ్‌ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అటు పార్థసారథి కుటుంబసభ్యుల షేర్లు కూడా ఫ్రీజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story