Karimnagar: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న కరీంనగర్ సిసిఎస్ పోలీసుల

పలు దొంగతనాలతో నిందితులైన అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న కరీంనగర్ సిసిఎస్ పోలీసులు.

admin1
Published on: 13 March 2020 3:38 PM IST
Karimnagar: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న కరీంనగర్ సిసిఎస్ పోలీసుల
X
Karimnagar CCS Police

కరీంనగర్ టౌన్ : పలు దొంగతనాలతో నిందితులైన అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న కరీంనగర్ సిసిఎస్ పోలీసులు. మొన్న కరీంనగర్ లో పట్టపగలే జరిగినచోరీ లో నిందితుడైన ఆనంద్ కుమార్ ఇప్పటివరకు 28 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా కూడా ప్రవర్తనలో మార్పు రాలేదని, మళ్లీ దొంగతనాలువృత్తిగా చేస్తున్నాడని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగి బూర్ల ఆత్మారాం ఇంట్లో పట్టపగలే దొంగతనం చేసి పారిపోతుండగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్నిగుర్తుపట్టి క్లూస్ టీం మరియు సైబర్, ఫోరెన్సిక్ వారి సహకారంతో నిందితుల్ని చాకచక్యంగా వన్టౌన్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.

మరో ముగ్గురునిందితులు 80 కేసుల్లో నిందితులని వారిలో ఇద్దరు బావ బామ్మర్దులు కూడా ఉన్నారని నేరం చేయడమే ఒక వృత్తిగా భావించి అదేపనిగా ఆటోలు కార్లుఅమాయక ప్రజలు ప్రయాణికులను బెదిరించి బంగారం నగదు తీసుకుని పారిపోతుందని తెలిపారు. డిసెంబర్ 25న కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డలో ఆడేపుసందీప్ అనే వ్యక్తి తన ఆటో కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఇట్టి కేసుకు సంబంధించిన సీసీ కెమెరాలు ఆధారంగా సిసిఎస్ పోలీసులు నిందితులనుపట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు సయ్యద్ యూసఫ్ మహమ్మద్ బషీర్ ఖాన్ దుర్గా హుస్సేన్ షా వాలి వీరంతా రాజేంద్రనగర్రం గారెడ్డి సైబరాబాద్ ని వాసులని వీరిని అరెస్టు చేసి రికవరీ చేశామని త్వరలో మొత్తం రికవరీ చేస్తామని అన్నారు..


admin1

admin1

Next Story