జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు

Gang Rape Case: జూబ్లీహిల్స్ మైనరు బాలిక అత్యాచార కేసులో కీలక ఘట్టం పూర్తయింది.

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 7:14 PM IST
Jubilee Hills Gang Rape Case Accused Were Identified by Victim
X

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు

Gang Rape Case: జూబ్లీహిల్స్ మైనరు బాలిక అత్యాచార కేసులో కీలక ఘట్టం పూర్తయింది. అత్యాచార కేసులో నిందితుల్ని బాలిక గుర్తించే ప్రక్రియను ఇవాళ నిర్వహించారు. న్యాయమూర్తి సమక్షంలో జైల్లో ఉన్న నిందితులతో కలిపి అత్యాచార నిందితుల్ని నిలబెట్టి గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. నిందితుల్ని గుర్తించిన బాలిక పోలీసులకు తెలిపింది. నిందితుల గుర్తింపు ప్రక్రియను పర్యవేక్షించిన న్యాయమూర్తి, బాధితురాలు చెబుతున్న వివరాలను రికార్డుచేశారు. చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్ధీన్‌తో పాటు, సైదాబాద్ జువనైల్ హోమ్‌లో ఉన్న ఐదుగురు మైనరు బాలురను గుర్తించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story