టాలీవుడ్ నటులపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. రేపు హీరో నితిన్‌తో జేపీ నడ్డా మీటింగ్...

JP Nadda to Meet Hero Nithin In Hyderabad
x

టాలీవుడ్ నటులపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. రేపు హీరో నితిన్‌తో జేపీ నడ్డా మీటింగ్...

Highlights

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ కానున్నారు.

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ కానున్నారు. రేపు తెలంగాణ పర్యటనకు రానున్న జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర్లోని నొవాటెల్ హోటల్లో హీరో నితిన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి టాలీవుడ్ అగ్రహీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ సినిమాను తాను ఇటీవలే చూశానని ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్బుతమని అమిత్ షా కొనియాడారు.

ఎన్టీఆర్‌తో దాదాపు అరగంటపాటు భేటీ అయిన అమిత్ షా పలు విషయాలపై చర్చించినట్లు తెలిసినా కేవలం ట్రిపుల్ ఆర్ సినిమా గురించే ఎన్టీఆర్‌తో భేటీ అయినట్లు బీజేపీ నేతలు మీడియాకు వివరించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ సరికొత్త యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోలతో వరుస భేటీలు నిర్వహిస్తూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories